చాక్లెట్ ట్యూబుల్లో రూ.24.5 కోట్ల కొకైన్!
హైదరాబాద్, సెప్టెంబరు 30: చాక్లెట్ ట్యూబుల్లో ఏకంగా రూ.24.5 కోట్ల విలువైన కొకైన్‌ను దాచుకుని వచ్చిన ప్రయాణికుడిని డీఆర్‌ఐ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. దోహా నుంచి వచ్చిన భారతీయ ప్రయాణికుడి క్యాబిన్ బ్యాగేజీలో ఏడు లిండ్ట్ లిండోర్ చాక్లెట్ ట్యూబులను గుర్తించారు. అవి సాధారణ బరువుకంటే ఎక్కువగా ఉండటంతో తనిఖీ చేయగా.. చాక్లెట్ల మధ్య 207 లేత పసుపు రంగు క్యాప్సూల్స్ బయటపడ్డాయి. వాటిలోని తెల్లటి పొడిని పరీక్షించగా కొకైన్‌గా నిర్ధారణ అయింది. మొత్తం 4.9 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకుని, ప్రయాణికుడిని NDPS చట్టం కింద అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.