ల్యాబ్ పరీక్షలు సమర్థంగా నిర్వహించాలి
ఖమ్మం: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలవారీగా నిర్వహిస్తున్న ల్యాబ్ పరీక్షల నివేదికలను ఇన్‌చార్జ్ జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు పరిశీలించారు. గురువారం పాత డీఎంహెచ్‌వో కార్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా పరీక్షల వివరాలను పరిశీలించి, అవసరమైన రాపిడ్ కిట్లు, స్టెయినింగ్ కెమికల్స్, మైక్రోస్లైడ్‌లను పంపిణీ చేశారు. పరీక్షల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఇన్‌చార్జ్ అసిస్టెంట్ మలేరియా అధికారి వేణుగోపాల్ సూచించారు.