తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు!

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులు, సంక్షేమం, భూములు, మౌలిక వసతులు, విద్య తదితర అంశాలపై కీలకంగా చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలకు ఆమోదం ఇవ్వడం, రూ.5 లక్షల కుటుంబ జీవిత బీమాతో కూడిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు విధానాన్ని ఖరారు చేయడం వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ధరణి, 22-ఏ భూముల సమస్యలపై చర్యలు, హైదరాబాద్‌ మెట్రో విస్తరణ, మూసీ రివర్‌ఫ్రంట్‌ ప్రాజెక్టు, రీజినల్‌ రింగ్‌ రోడ్‌ పనుల పురోగతిపై సమీక్ష జరిగినట్లు సమాచారం. డిసెంబరులో నిర్వహించనున్న గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లపైనా చర్చించారు. పాలిటెక్నిక్‌ కళాశాలలను స్కిల్‌...