కత్తిపోట్లతో రక్తమోడినా.. 174 మందిని కాపాడిన భారత పైలట్!
న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బోయింగ్ 737 మ్యాక్స్8లో కెప్టెన్ స్మిత్ మచార్‌పై కో-పైలట్ కత్తితో దాడి చేసినట్లు అధికారులు, పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తీవ్రంగా గాయపడినప్పటికీ మచార్ కాక్‌పిట్ తలుపును తెరిచేందుకు వీలుగా వ్యవహరించడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి చేరుకున్నారు. కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్న అనంతరం విమానంలో ఉన్న మరో ఇద్దరు పైలట్లు నియంత్రణ చేపట్టారు. ఈ సమయంలో విమానం సుమారు 14 వేల అడుగుల మేర వేగంగా కిందికి దిగినట్లు ప్రాథమిక సమాచారం. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. విమానంలో ఉన్న...