మట్టిలో పుట్టిన ఆరాధన.. తరతరాలుగా వస్తున్న బొడ్డెమ్మ!

హైదరాబాద్ : తెలంగాణ పల్లెల్లో బతుకమ్మకు ముందుగా వినిపించే పాట.. ఆడబిడ్డల చేతుల్లో కనిపించే మట్టి రూపం.. చెరువు గట్టున సామూహికంగా జరిగే పూజ.. ఇవన్నీ కలిస్తే బొడ్డెమ్మ. నేటి తరానికి ఇది ఒక పండుగగా కనిపించినా.. గ్రామీణ తెలంగాణలో ఇది కేవలం వేడుక కాదు. మట్టి, నీరు, వ్యవసాయం, మహిళల సామూహిక జీవనం, ప్రకృతిపై ఆధారపడిన పల్లె సంస్కృతితో ముడిపడిన ఆచారంగా తరతరాలుగా కొనసాగుతోంది. మట్టినే అమ్మగా కొలిచిన కాలం.... పూర్వకాలంలో తెలంగాణ పల్లె జీవితం పూర్తిగా వ్యవసాయం, వర్షాలు, చెరువులు, బావులు, పంటలపై ఆధారపడి ఉండేది. వర్షాకాలం ముగిసే సమయంలో ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పడం, భూమిని తల్లిగా భావించడం, నీటి వనరులను పవిత్రంగా...