ఉపసర్పంచ్ చెక్ పవర్‌పై సర్కార్ కొరడా!*

హైదరాబాద్ :గ్రామ పంచాయతీల్లో చెక్కుల జారీ, బిల్లుల చెల్లింపుల విషయంలో సర్పంచ్–ఉపసర్పంచ్‌ల మధ్య నెలకొంటున్న వివాదాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. చెక్కులపై సంతకాలు చేయడంలో ఉపసర్పంచ్‌లు కారణం లేకుండా జాప్యం చేయకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది. చెక్కులపై సంతకం చేయకుండా 7 రోజులకు మించి జాప్యం చేస్తే కలెక్టర్ స్థాయిలో విచారణ చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసినట్లు విచారణలో తేలితే సంబంధిత ఉపసర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక ఉపసర్పంచ్ అందుబాటులో లేకపోయినా, లేదా నిర్దేశిత సమయంలో చెక్‌పై సంతకం చేయకపోయినా పంచాయతీ కార్యదర్శి, MPO/MPDOల సమన్వయంతో జాయింట్ చెక్ పవర్‌కు సంబంధించిన చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం....