మామునూరు వద్ద డివైడర్‌ను ఢీకొన్న కారు
వరంగల్: వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై మామునూరు గ్రామ శివారులో ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పింది. గాయపడిన అతడిని 108లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తాత్కాలిక డివైడర్ కారణంగానే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. డివైడర్‌ను వెంటనే తొలగించి, ప్రమాదాల నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని వారు కోరారు.