అంగన్వాడీ సిబ్బందిని సత్కరించిన మాజీ ఎమ్మెల్యే
వరంగల్: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో గురువారం వర్ధన్నపేట పట్టణంలో ‘అంగన్ మిలన్ సేవా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 3, 4వ డివిజన్ల అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ అక్కడ పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బందిని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, విద్య, పోషణ కోసం అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవల ప్రాధాన్యాన్ని వివరించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు తదితర పోషకాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో డా. వన్నాల వెంకటరమణ,...