అక్రమ గృహ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి

హన్మకొండ:పరకాల పట్టణంలోని గొడ్ల అంగడి ముందు ఇంటి నంబర్ 3-277 వద్ద మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్న గృహ నిర్మాణంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు ఏకు శంకర్ మాదిగ రీజనల్ డైరెక్టర్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. భవన నిర్మాణ అనుమతులు, ఆమోదిత ప్లాన్, సెట్బ్యాక్స్, రోడ్డు ఎఫెక్టెడ్ ఏరియా నిబంధనలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు. రోడ్డు వైపు బాల్కనీ పొడిగింపు, డ్రైనేజీపై పిల్లర్లు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే మున్సిపాలిటీలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం ఉన్నట్లు తేలితే తగిన...