కేయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్

హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌కు చెందిన నలుగురు విద్యార్థులు హైదరాబాద్‌కు చెందిన సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్‌లో జూనియర్ మెకానికల్ డిజైన్ ఇంజినీర్లుగా ఎంపికయ్యారు. పి.వర్ధన్, టి.శివసాయి సింహ, పి.పవన్‌కుమార్, భార్గవికి ఏడాదికి రూ.3.60 లక్షల ప్యాకేజీ లభించనుంది. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎన్.రమణ అభినందించారు.