గో సంరక్షణకు సంపూర్ణ సహకారం: ప్రదీప్‌రావు

వరంగల్: గోవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పిలుపునిచ్చారు. గో సమ్మాన్ అభియాన్ తెలంగాణ ఇన్‌చార్జ్ సంకాదిక్ దాస్ మహారాజ్ నేతృత్వంలోని ప్రతినిధులు ప్రదీప్‌రావును కలిసి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. గో సంరక్షణకు సంపూర్ణ సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభారి జంగా ప్రభాకర్ పాల్గొన్నారు.