గ్రామ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా: సర్పంచ్ కుల్ల మోహన్ రావు

జఫర్ ఘడ్, అక్టోబర్ 1 : ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో గ్రామ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని సర్పంచ్ కుల్ల మోహన్ రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని వడ్డే గూడెంలో పది లక్షల రూపాయలతో నిర్మించనున్న ఎన్ఆర్ఈజీఎస్ పనులను వార్డు సభ్యులు స్థానిక నాయకులతో కలిసి ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ ఎన్ఆర్ఈజిఎస్ నిధుల ద్వారా గ్రామంలో సిసి రోడ్లు లేనిచోట చేసి రోడ్లు వేయనున్నట్లు ఆయన తెలిపారు.రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్గత రోడ్ల నిర్మాణంతో గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.రోడ్ల నిర్మాణంతో అభివృద్ధికి పునాదులు పడతాయని తెలిపారు.గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెయ్యడానికి తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తునట్టు చెప్పారు.ఈకార్యక్రమంలో...