దిశా కమిటీ సమావేశం ప్రారంభం
హనుమకొండ: జిల్లా కలెక్టరేట్‌లో వరంగల్ ఎంపీ, జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) చైర్‌పర్సన్ డాక్టర్ కడియం కావ్య అధ్యక్షతన దిశా కమిటీ సమావేశం బుధవారం ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల పురోగతిపై సమీక్షిస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, సాగునీరు తదితర రంగాలపై శాఖల వారీగా చర్చిస్తున్నారు.