ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావును పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు

వర్ధన్నపేట: మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ భర్త, సీనియర్‌ రాజకీయ నాయకుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావును వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి కేఆర్‌ నాగరాజు పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటికి చేరుకున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.