పెన్షన్ కోసం 16 ఏళ్ల గోవిందమ్మ నిరీక్షణ

వికారాబాద్: పెన్షన్ కోసం 16 ఏళ్లుగా ఎదురుచూస్తున్న గోవిందమ్మ కుటుంబం అధికారుల చుట్టూ తిరుగుతోంది. సిరిగిరిపేట్‌కు చెందిన గోవిందమ్మ వికలాంగురాలు కావడంతో పెన్షన్ కోసం గత మూడు నెలలుగా తాండూరు ఎంపీడీవో కార్యాలయానికి వస్తున్నట్లు ఆమె తండ్రి రాజు తెలిపారు. నడవలేని పరిస్థితిలోనూ కార్యాలయానికి వచ్చి గంటల తరబడి నిరీక్షిస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి తన కుమార్తెకు వికలాంగుల పెన్షన్ మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని రాజు విజ్ఞప్తి చేశారు.