డబ్బుల కోసం అమ్మమ్మను చంపిన మనవడు

చౌటుప్పల్: డబ్బుల కోసం ఓ వృద్ధురాలిని ఆమె మనవడు హత్య చేసిన ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం తుప్పాన్‌పేట్‌లో వెలుగుచూసింది. ఈ నెల 27న యాదమ్మ (70) ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మేనల్లుడు దర్శన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో డబ్బుల కోసమే మనవడు యాదమ్మను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.