మహిళా సంఘాలకు ఉపాధి కల్పించేలా పప్పు మిల్లు ఏర్పాటు
వరంగల్:కంది పప్పు మిల్లు ఏర్పాటుకు కలెక్టర్ సత్యశారద పర్వతగిరి మండలంలోని కొంకపాక, పర్వతగిరి మార్కెట్ యార్డులను అధికారులతో కలిసి పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించడంతో పాటు స్థానిక పంటలకు విలువ జోడించేలా కంది, ఇతర పప్పు దినుసుల మిల్లు ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. అనంతరం దౌలత్నగర్, ఉట్టి తండా అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల్లో అపరిశుభ్రతపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులకు యూనిఫాం, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించని అంగన్వాడీ టీచర్లు, కేంద్రాలను తనిఖీ చేయని సూపర్వైజర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు.