పోక్సో కేసులో సాక్షులను మళ్లీ విచారించలేం

న్యూఢిల్లీ: న్యాయవాది సాక్షులను సరిగా క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయలేదన్న కారణంతో కొత్త న్యాయవాదిని నియమించి వారిని మళ్లీ విచారించేందుకు అవకాశం ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌ల ధర్మాసనం బుధవారం పిటిషన్‌ను కొట్టివేసింది. హనుమకొండలో నమోదైన పోక్సో కేసులో ప్రధాన సాక్షులను మరోసారి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసేందుకు అనుమతించాలని నిందితుడు కోరారు. ఇప్పటికే సాక్షుల విచారణ, క్రాస్‌ ఎగ్జామినేషన్‌, ట్రయల్‌ పూర్తయి, డిఫెన్స్‌ వాదనలకు కేసు వాయిదా పడిన తర్వాత న్యాయవాది మార్పునకు పిటిషన్‌ దాఖలైంది. తొలుత హైకోర్టు, తాజాగా సుప్రీంకోర్టు కూడా పిటిషన్‌ను తిరస్కరించాయి. న్యాయవాది సరిగా విచారించలేదన్న కారణంతో సాక్షులను మళ్లీ విచారించేందుకు...