సైబర్ మోసాలపై తెలంగాణలో అవగాహన మాసం
హైదరాబాద్: డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అక్టోబర్ నెలలో ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 1న హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద 2 కిలోమీటర్ల సైబర్ సేఫ్టీ నైట్ వాక్ నిర్వహించనున్నారు. ‘డిజిటల్ సేఫ్టీ ఫర్ ఫ్యామిలీస్’ అనే అంశంతో ఈ నెలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 1న జరిగే కార్యక్రమాన్ని ‘సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్–పాజ్ ఫర్ సేఫ్టీ’గా నిర్వహించనున్నారు. ప్రజలు మొబైల్ ఫ్లాష్‌లైట్లు వెలిగించడం ద్వారా సైబర్ మోసాలపై అప్రమత్తతకు ప్రతీకగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త...