పదవీ విరమణ పొందిన నలుగురు ఎస్సైలకు సన్మానం

వరంగల్: పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన నలుగురు ఎస్సైలకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఎస్సైలు లక్ష్మీనారాయణ, కొమురయ్య, పర్శురాములు, రమేశ్‌ పదవీ విరమణ సందర్భంగా సీపీ శ్వేత, ఐపీఎస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన అధికారులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు. పోలీస్ శాఖలో వారు అందించిన సేవలను సీపీ శ్వేత అభినందించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి శాఖకు సేవలందించిన వారి సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని సీపీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో పోలీస్...