నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లకు దరఖాస్తు
హైదరాబాద్: తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ల కోసం నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసిన 37 మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గుర్తించినట్లు సమాచారం. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటకకు చెందిన విద్యార్థులు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిలో ఇప్పటికే తొమ్మిది మందికి ఎంబీబీఎస్ సీట్లు కేటాయించగా, వాటిని రద్దు చేసే ప్రక్రియ చేపట్టినట్లు సమాచారం. 2026–27 వైద్య ప్రవేశాల్లో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలనకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. పత్రాల పరిశీలనలో తేడాలు గుర్తిస్తే సీట్ల కేటాయింపును రద్దు చేసే నిబంధనలు అమల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.