వికారాబాద్ జిల్లాలో డీజీ మహేష్ భగవత్ పర్యటన

వికారాబాద్: తెలంగాణ లా అండ్ ఆర్డర్ డీజీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ భగవత్ వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బొంరాస్‌పేట్, కొడంగల్, దుద్యాల పోలీస్‌స్టేషన్లతో పాటు కొడంగల్ సీఐ కార్యాలయ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. జిల్లాకు వచ్చిన డీజీకి ఎస్పీ స్నేహ మెహ్రా స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో కలిసి నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించిన మహేష్ భగవత్.. గదులు, మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుధ్య ఏర్పాట్లను తనిఖీ చేశారు. భవనాల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేసి...