వైద్యశిబిరం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కలెక్టర్ తనిఖీ
మహబూబాబాద్: నెల్లికుదురు మండలంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని వైద్యశిబిరాన్ని, ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశిబిరంలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు అందుతున్న సౌకర్యాలపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మందుల లభ్యత, వైద్య సిబ్బంది పనితీరు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, హాజరు, మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వ సంస్థల్లో ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా అధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.