గడువు ముగిసిన ఆహార పదార్థాల స్వాధీనం
హన్మకొండ:గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న రెస్టారెంట్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి దాడి చేశారు. సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని హంటర్‌రోడ్డులో ఉన్న కింగ్స్‌వే రెస్టారెంట్ అండ్ బార్లో బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.2,252 విలువైన గడువు ముగిసిన ఉప్పు, సింథటిక్ వెనిగర్, ఫుడ్ కలర్స్, స్ట్రాబెర్రీ క్రష్, చూరా కాజు, మినపప్పు తదితర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారి పాడిదెం మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పదార్థాలతో పాటు నిందితుడిని వరంగల్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్ తెలిపారు. తదుపరి చర్యలు చట్ట ప్రకారం ఉంటాయని పేర్కొన్నారు.