సిరిసిల్లను ఉరిసిల్ల చేసిండ్రు... సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
సిరిసిల్ల : ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి బుధవారం సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్‌ఎస్, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సిరిసిల్లను గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ‘‘ఉరిసిల్ల’’గా మార్చారని ఆరోపించారు. చేనేతను నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలను గత పాలకులు పట్టించుకోలేదని, సిరిసిల్ల ప్రజల గురించి కేటీఆర్ ఏనాడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. ‘‘సిరిసిల్లపై గురి పెడదాం’’ సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గజ్వేల్‌లో గతంలో ‘‘గడీని నేలమట్టం చేస్తామని చెప్పి చేసి చూపించాం’’ అని పేర్కొంటూ.. ఇప్పుడు సిరిసిల్ల గడీని కూల్చేస్తామని అన్నారు. సిరిసిల్ల ప్రజలు తమ ఓట్లతో బీఆర్‌ఎస్‌ను ఆదరించారని, ఆ...