సిరిసిల్లపై సీఎం రేవంత్ గురి!
సిరిసిల్ల : ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన సీఎం ఎ.రేవంత్‌రెడ్డి.. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాజకీయ అంశాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ నుంచి హెలికాప్టర్‌లో సిరిసిల్ల చేరుకున్న ఆయన అంబేడ్కర్ చౌరస్తా నుంచి ఫూలే, నేతన్న విగ్రహాల మీదుగా సభా ప్రాంగణం వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం రగుడు బైపాస్ సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. రూ.345.78 కోట్ల పనులకు శ్రీకారం సిరిసిల్ల జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సిరిసిల్ల, వేములవాడలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి సుమారు రూ.200 కోట్లు, వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి...