అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. ఇరాన్‌కు చెందిన ఓ పడవను ఇండియన్ కోస్ట్‌గార్డ్, గుజరాత్ ఏటీఎస్‌ సంయుక్త బృందం అడ్డుకుని తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో పడవలో అక్రమంగా తరలిస్తున్న 526 కిలోల హెరాయిన్, మెథాంఫెటమైన్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్‌ విలువ రూ.3 వేల కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పడవలో ఉన్న ఐదుగురు పాకిస్థానీయులను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.