విద్యుత్ షాక్‌తో గొర్రెల కాపరి మృతి

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఊట్ల గ్రామానికి చెందిన చందా ఎల్లమ్మ గొర్రులను మేతకు తీసుకెళ్లగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. బుధవారం రోజువారీగా గొర్రులను మేతకు తీసుకెళ్లిన ఆమెకు ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురైనట్లు స్థానికులు తెలిపారు. తీవ్ర విద్యుత్ షాక్‌కు గురైన ఎల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో ఊట్ల గ్రామంలో విషాదం నెలకొంది.