ఏవో వీరభద్రం వాట్సాప్ హ్యాక్.. రూ.లక్ష వరకు సైబర్ మోసం?
రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండల వ్యవసాయ అధికారి (ఏవో) వీరభద్రం వాట్సాప్ ఖాతా హ్యాక్ కావడం కలకలం రేపింది. సైబర్ నేరగాళ్లు ఆయన వాట్సాప్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని మండల, జిల్లా స్థాయి అధికారులు, బంధువులు, రైతులకు వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపినట్లు సమాచారం. తాను ఆస్పత్రిలో ఉన్నానని, అత్యవసరంగా డబ్బులు అవసరమని నమ్మించేలా మెసేజ్‌లు పంపినట్లు తెలుస్తోంది. మెసేజ్‌లను నిజమని నమ్మిన కొందరు వ్యక్తులు నేరగాళ్లు సూచించిన ఖాతాలకు డబ్బులు పంపినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు దాదాపు రూ.లక్ష వరకు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఎంతమంది నుంచి ఎంత మొత్తం వసూలు చేశారనే పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో...