*చెన్నారంలో మద్యం జోరు!*
వర్ధన్నపేట : మండలంలోని చెన్నారం గ్రామంలో మద్యం విక్రయాలపై స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామంలో మద్యం విక్రయాలు నిర్వహించే బెల్టు షాపుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండా కిరాణ దుకాణాలతో పాటు కొన్ని చిల్లర దుకాణాల్లోనూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా మద్యం అందుబాటులో ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మద్యం సులభంగా లభించడం వల్ల యువతలో కొందరు మద్యానికి బానిసలవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రోజువారీ కూలీ, చిన్నచిన్న పనులు చేసుకునే కుటుంబాల ఆదాయంలో కొంత భాగం...