తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టం.. నేటికి సాగరహారానికి 14 ఏళ్లు!
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిన ‘సాగరహారం’కు నేటితో 14 ఏళ్లు పూర్తయ్యాయి. 2012 సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరంలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్వరాష్ట్ర ఆకాంక్షను చాటిచెప్పేందుకు తెలంగాణవాదులు భారీగా తరలివచ్చారు. ఆంక్షలు, భారీ బందోబస్తు, నిర్బంధాల మధ్య సాగరహారం నిర్వహించడం అప్పట్లో రాజకీయంగా, ఉద్యమపరంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 తర్వాత ఉద్యమం మరింత ఉధృతమైంది. ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, రైతులు, మహిళలు, ప్రజా సంఘాలు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం వంటి కార్యక్రమాలు ఉద్యమంలో కీలక మలుపులుగా నిలిచాయి. ఉమ్మడి...