బలూచిస్థాన్‌లో మహిళా రెబల్స్ మెరుపుదాడి.. 9 మంది పాక్ సైనికులు మృతి!
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో మహిళా సాయుధ విభాగం జరిపినట్లు చెబుతున్న దాడి కలకలం రేపింది. బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)కు చెందిన ‘కరీమా’ మహిళా విభాగం, చైనా–పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) హైవే సమీపంలో పాక్ సైనిక కాన్వాయ్‌పై మెరుపుదాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు మృతి చెందినట్లు దాడికి సంబంధించిన వర్గాలు వెల్లడించాయి. దాడికి సంబంధించిన వీడియోను బీఎల్ఎఫ్ విడుదల చేసినట్లు సమాచారం. పలు వాహనాలు ధ్వంసమైనట్లు మహిళా విభాగం ప్రతినిధి పేర్కొన్నారు. అయితే తొమ్మిది మంది సైనికులు మృతి చెందారన్న బీఎల్ఎఫ్ వాదనను స్వతంత్రంగా ధృవీకరించిన సమాచారం అందుబాటులో లేదు.