ఆయిల్ ట్యాంకర్ ఢీకొని పాస్టర్ మృతి

హన్మకొండ:ఎల్కతుర్తి మండలం ఎల్లాపురం బ్రిడ్జి వద్ద ఆయిల్‌ ట్యాంకర్‌ బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఎల్కతుర్తి చర్చి పాస్టర్‌ సందెల మాణిక్యం (75) మృతి చెందారు. వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై హనుమకొండ వైపు వెళ్లిన మాణిక్యం తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎల్లాపురం బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఆయిల్‌ ట్యాంకర్‌ బైక్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన మాణిక్యం అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.