బస్టాండ్‌లో ప్రయాణికుడి మొబైల్ చోరీ.. నిందితుడు అరెస్టు
హన్మకొండ: బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని మొబైల్ ఫోన్ చోరీ చేసిన అరవింద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి చోరీకి గురైన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఉప్పల్, నల్గొండ-2 టౌన్, చేవెళ్ల, ఆర్పీఎస్ వరంగల్, సికింద్రాబాద్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో గతంలో ఆరు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్టాండ్‌లు, మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.