ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ఏబీవీపీ ఆందోళన
వరంగల్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలలో జాప్యం చేయడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏబీవీపీ ప్రతినిధులు పేర్కొన్నారు. వెంటనే బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్‌ఎఫ్‌సీ కోర్సులను రెగ్యులర్ చేయాలని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని ఏబీవీపీ నాయకులు తెలిపారు.