ఖైరతాబాద్ తర్వాత.. స్టేషన్ ఘనపూర్‌లో చర్చ!
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం, అనంతరం ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ప్రకటించడంతో.. ఇదే అంశం ఇప్పుడు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంపైనా చర్చకు దారితీస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలిచారు. 2024లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరో పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు పార్టీ ఫిరాయింపుల చట్టంలోని పదో షెడ్యూల్ కింద సవాల్ చేశారు....