వరంగల్ ఎయిర్‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి
హైదరాబాద్: వరంగల్ మామునూరు విమానాశ్రయానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని తెలంగాణ ఇంటెలెక్చువల్స్ ఫోరం డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ కంచె ఐలయ్య, పాశం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కొమురయ్య త్యాగాలకు తగిన గుర్తింపు కల్పించాలని, సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేయాలని కోరారు. పేరుపై ప్రభుత్వం విస్తృతంగా చర్చించి ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.