అక్టోబర్‌ నెలాఖరులో పత్తి కొనుగోళ్లు

వరంగల్‌: సీసీఐ అక్టోబర్‌ నెలాఖరు నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 64 జిన్నింగ్‌ మిల్లులను నోటిఫై చేశారు. వరంగల్‌ జిల్లాలో 27 మిల్లులు, మరో మూడు మిల్లులను నోటిఫై చేసే అవకాశం ఉంది. 2026-27 సీజన్‌కు పత్తి మద్దతు ధరను గత ఏడాదితో పోలిస్తే రూ.507 పెంచి క్వింటాలుకు రూ.8667గా కేంద్రం నిర్ణయించింది. మిల్లుల్లో ఫైర్‌ సేఫ్టీ, వేబ్రిడ్జి, బీమా, జిన్నింగ్‌ సామర్థ్యం వంటి సదుపాయాలను తనిఖీ చేసి కొనుగోళ్లకు అనుమతించనున్నారు.