కొత్త కోచ్‌లతో కాకతీయ ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్: సికింద్రాబాద్–భద్రాచలం రోడ్ మధ్య నడిచే కాకతీయ ఎక్స్‌ప్రెస్ (17659/17660) ఇక కొత్త తరం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో అందుబాటులోకి రానుంది. నవంబర్ 5 నుంచి పాత ఐసీఎఫ్ కోచ్‌ల స్థానంలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ప్రవేశపెట్టేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త రేకులో దివ్యాంగుల కోసం ఒక కోచ్, ఐదు జనరల్, ఒక థర్డ్ ఏసీ, ఒక సెకండ్ ఏసీ, ఐదు సెకండ్ సిట్టింగ్, ఒక పవర్ కారుతో మొత్తం 14 కోచ్‌లు ఉంటాయి.