గాంధీ జయంతి రోజున మాంసం దుకాణాలు బంద్
వరంగల్: గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న నగరంలోని మాంసం దుకాణాలు మూసివేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న ఆదేశించారు. 66 డివిజన్ల పరిధిలో గొర్రెలు, మేకల వధతో పాటు చికెన్ విక్రయాలను కూడా నిషేధించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి మాంసం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, విక్రయాలు జరిపే దుకాణాలను వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు.