ఏఐ వాయిస్‌, నకిలీ ఆఫర్‌ లెటర్లతో బురిడీ.. నిందితుడి అరెస్ట్‌

వరంగల్‌: యూకేలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తిని నమ్మించి రూ.83 లక్షలు వసూలు చేసిన కేసులో నిందితుడు మార్క శివకుమార్‌ను పర్వతగిరి పోలీసులు మంగళవారం వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. నకిలీ సిమ్‌కార్డులు, వాట్సాప్‌ చాటింగ్‌, ఏఐ వాయిస్‌ మెసేజ్‌లు, నకిలీ ఈమెయిల్‌, ఆఫర్‌, జాయినింగ్‌ లెటర్లతో బాధితుడిని నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. రెండు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకుని డిజిటల్‌ ఆధారాలను పరిశీలిస్తున్నారు.