సమాజ మార్పు కోసం ఏఐఎస్ఎఫ్ ఉద్యమించాలి

హన్మకొండ:సమాజ మార్పు కోసం విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాజీపేటలో ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. విద్యారంగ సమస్యలతో పాటు సామాజిక సమస్యలపై కూడా విద్యార్థులు పోరాడాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై వామపక్ష విద్యార్థి సంఘాలు స్పందించాలని అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పూర్వ నాయకులు, వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని ఘనంగా సన్మానించారు. పలువురు సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.