ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు
జఫర్ ఘడ్, సెప్టెంబర్ 29 : జనగామ జిల్లా జఫర్ ఘడ్ మండల కేంద్రమైన రైతు వేదికలో పెట్టుబడి లేని జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ( ఎన్.ఎం. ఎన్ .ఎస్) పై రైతులకు మంగళవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.తెలంగాణ వ్యవసాయ కమిషనర్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలోని హిమాయత్ నగర్ గ్రామంలో ఎన్ఎంఎన్ఎఫ్ పథకం కింద ఎంపికైన 125 మంది రైతులకు మండల వ్యవసాయ అధికారి చంద్రన్ కుమార్ కిట్లను పంపిణీ చేశారు. కిట్లలో రైతు డైరీ, క్యాలెండర్, బ్యాగ్, పెన్నులు, గుర్తింపు కార్డు, ఫోన్ బుక్ తదితర సామగ్రిని అందించారుఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ...