కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా కంజర్ల మహేష్‌

వర్ధన్నపేట: కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా వర్ధన్నపేటకు చెందిన కంజర్ల మహేష్‌ నియమితులయ్యారు. గతంలో బీఆర్‌ఎస్‌లో జిల్లా స్థాయి బాధ్యతలు నిర్వహించిన ఆయన ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఈగ దామోదర్‌ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు మహమ్మద్‌ అయూబ్‌ మహేష్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మహేష్‌ తెలిపారు.