మామునూరు విమానాశ్రయానికి అంబేద్కర్ పేరు పెట్టాలి
వరంగల్:మామునూరు విమానాశ్రయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వర్ధన్నపేట పట్టణంలో నిర్వహించిన సమావేశంలో MASS రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాములు మాదిగ మాట్లాడుతూ, విమానాశ్రయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంఘాలతో కలిసి ధర్నా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు ఈరెల్లి శ్రీనివాస్ మాదిగ, బీసీ సంక్షేమ సంఘం వర్ధన్నపేట నియోజకవర్గ కార్యదర్శి మామిండ్ల చెన్నయ్య యాదవ్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జన్ను నర్సయ్య మాదిగ, వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ జంగిలి భాస్కర్ మాదిగతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.