కృష్ణజింక వేట గుట్టురట్టు

షాద్‌నగర్‌: కృష్ణజింకను అక్రమంగా వేటాడి మాంసాన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలపై షాద్‌నగర్‌ పోలీసులు, ఎస్‌వోటీ, అటవీశాఖ అధికారులు 9 మందిని అరెస్ట్‌ చేశారు. రాయికల్‌ టోల్‌ప్లాజా సమీపంలో నిందితులను అడ్డుకుని సుమారు 13 కిలోల కృష్ణజింక మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. టెలిస్కోపిక్‌ సైట్‌, సైలెన్సర్‌తో కూడిన .315 రైఫిల్‌, 19 బుల్లెట్లు, రెండు వాహనాలు, 8 స్మార్ట్‌ఫోన్లు, కెమెరా, టార్చ్‌లైట్లు, రూ.28,590 నగదు సీజ్‌ చేశారు. నారాయణపేట సమీపంలోని మరికల్‌ అటవీ ప్రాంతంలో వేటాడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.