వరుసగా రెండో రోజూ నష్టాల్లో సూచీలు.. నిఫ్టీ 0.8 శాతం డౌన్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. సోమవారం భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు మంగళవారం కూడా బలహీనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.48 గంటలకు నిఫ్టీ 50 సుమారు 22,600 వద్ద 0.8 శాతానికి పైగా నష్టపోయింది. సోమవారం నిఫ్టీ 1.56 శాతం, సెన్సెక్స్ 1.52 శాతం పడిపోయాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ముడిచమురు ధరల పెరుగుదల, అమెరికా బాండ్ ఈల్డ్స్, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు ప్రభావం చూపుతున్నాయి. బ్యాంకింగ్, ఐటీ, మెటల్, ఆటో తదితర రంగాలు నష్టాల్లో ఉండగా.. హెల్త్‌కేర్, ఫార్మా స్వల్ప లాభాల్లో ఉన్నాయి.