తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోకేశ్, షణ్ముగం
తిరుమల: ఏపీ మంత్రి నారా లోకేశ్, సింగపూర్ సీనియర్ మంత్రి, హోం వ్యవహారాల మంత్రి కె. షణ్ముగం మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. లోకేశ్ సుప్రభాతం, తోమాల, అర్చన సేవల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు వారికి స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ ఏర్పాట్లపై షణ్ముగం ప్రశంసలు వ్యక్తం చేసినట్లు సమాచారం.