తిరుమలలో బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుమల: పెరటాసి మాసం, వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 1, 5 తేదీల్లో ప్రోటోకాల్‌ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 4న సిఫార్సు లేఖలు స్వీకరించరు. ప్రస్తుతం రోజుకు సుమారు 80 వేల మంది దర్శనం చేసుకుంటుండగా, మరో 30 వేల మంది వేచి ఉంటున్నారని టీటీడీ తెలిపింది. సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకే ఈ నిర్ణయమని పేర్కొంది.