రెడ్‌క్రాస్‌ కమిటీలో డాక్టర్‌ రాజ్‌కుమార్‌కు చోటు

రాయపర్తి: తిరుమలయపల్లి గ్రామానికి చెందిన డాక్టర్‌ గజవెల్లి రాజ్‌కుమార్‌ ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ వరంగల్‌ జిల్లా నూతన మేనేజింగ్‌ కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వర్ధన్నపేటలో లక్ష్మీ గణపతి హాస్పిటల్‌ను స్థాపించిన ఆయన వైద్య సేవలతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. రెడ్‌క్రాస్‌ ద్వారా పేదలు, ఆపదలో ఉన్న వారికి మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తానని రాజ్‌కుమార్‌ తెలిపారు. బాధ్యత అప్పగించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.